వికారాబాద్ : వికారాబాద్ రైల్వేస్టేషన్ ప్లాటు ఫాం 1 వద్ద నాలుగేళ్ల బాలుడు తప్పిపోయి కనిపించాడు. గమనించిన ఆర్పీఎఫ్ ఏఎస్సై కిష్టయ్య గమనించి చైల్డ్‌లైన్ 1098కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన చైల్డ్‌లైన్ కౌన్సిలర్ రామేశ్వర్ బాలుడి వద్దకు చేరుకుని బాలుడిని వివరాలు అడుగగా పేరు హర్షిత్‌రెడ్డి, తండ్రి సంతోష్, తల్లి లావణ్య, గ్రామం కంచనెల్లి అని చెప్పాడు. బాలుడి చిరునామ తెలిసిన వారుంటే వికారాబాద్ సీఐ ఫోన్ నంబర్ 9440627354కు సమాచారం అందించాలని సీఐ రాజశేఖర్ తెలిపారు. బాలుడి తండ్రి కారు డ్రైవర్‌గా పని చేస్తుంటడని బాలుడు తెలిపాడు.