రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 100 మందితో వచ్చి ఇంటిపై దాడి.. యువతి కిడ్నాప్
Rangareddy | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో దారుణం జరిగింది. ఓ యువతి ఇంటిపై 100 మంది యువకులు దాడి చేశారు. అనంతరం తల్లిదండ్రులను చితకబాది, ఇంటిని ధ్వంసం
రంగారెడ్డి : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో దారుణం జరిగింది. ఓ యువతి ఇంటిపై 100 మంది యువకులు దాడి చేశారు. అనంతరం తల్లిదండ్రులను చితకబాది, ఇంటిని ధ్వంసం చేసి, ఆ యువతిని ఎత్తుకెళ్లారు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతలోపే అక్కడ్నుంచి యువకులు పరారీ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. రాగన్నగూడకు చెందిన ఓ యువతి ఇటీవలే బీడీఎస్(దంత వైద్యురాలు) పూర్తి చేసింది. దీంతో ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయితే నవీన్ కుమార్ రెడ్డి అనే యువకుడు ఐదారు నెలలుగా ఆ యువతిని ప్రెమించానని, పెళ్లి చేసుకుంటానని ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తున్నది. మధ్యవర్తుల ద్వారా కూడా యువతి తల్లిదండ్రులను పెళ్లి సంబంధం గురించి అడిగించినట్లు స్థానికులు చెబుతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఈ సంబంధం తమకు ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. ఇది మనసులో పెట్టుకుని నవీన్ ఈ కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది.
వేధింపులకు గురి చేసిన నవీన్..
పెళ్లి చేసుకోవడానికి యువతి తల్లదండ్రులు ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్న నవీన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నవీన్‌పై షీటీమ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు యువతి తండ్రి తెలిపారు. తమ కూతురును నవీన్ రెడ్డి అనే యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
యువతికి ఇవాళ పెళ్లి చూపులు..
ఈ క్రమంలో ఇవాళ యువతిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారన్న విషయం నవీన్ రెడ్డికి తెలిసింది. దీంతో ఈ పెళ్లి సంబంధం చెడగొట్టాలనే అక్కసుతో ఏకంగా 100 మంది యువకులను నవీన్ రెడ్డి వెంటేసుకుని వచ్చాడు. యువతి ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారిపై కూడా దాడి చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యువతి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

