నిజామాబాద్ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కుమార్తెను తన ప్రియుడితో కలిసి ఓ తల్లి చంపేసింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారులో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన దుర్గా భవాని తన భర్తతో కలిసి కొన్నేండ్ల క్రితం నిజామాబాద్‌కు వచ్చి బతుకుతోంది.
ఈ క్రమంలో రైల్వే స్టేషన్ వద్ద పని చేసే శ్రీను అనే వ్యక్తితో దుర్గా భవానికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే తన అక్రమ సంబంధానికి కూతురు అడ్డుగా ఉందని దుర్గా భవాని భావించింది. దీంతో తన ప్రియుడు శ్రీనుతో కలిసి కూతురును చంపింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. దుర్గాభవాని, శ్రీనును మక్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.