తల్లితో ఆస్తి వివాదాలు.. వ్యాపారవేత్త ఆత్మహత్య
హైదరాబాద్ : తల్లితో నెలకొన్న ఆస్తి వివాదాలు ఓ వ్యాపారవేత్త ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీనివాస్ అనే వ్యాపారవేత్త గోపాలపురంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అయితే గత కొద్ది నెలల నుంచి శ్రీనివాస్కు తన కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు ఉన్నాయి. తల్లి కూడా అతనికి ఆస్తి పంచి ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్.. బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే తల్లి, కుటుంబ సభ్యులు తనకు ఆస్తిలో వాటా ఇవ్వనందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు శ్రీనివాస్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

