సంపూర్ణేష్‌బాబు, విద్యుల్లేఖరామన్, సాఫీకౌర్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘పుడింగి నెంబర్ వన్’. మీరావలి దర్శకుడు. కె. శ్రీనివాసరావు, కె. సుధీర్‌కుమార్ నిర్మాతలు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్.రామారావు క్లాప్‌నివ్వగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విఛాన్చేశారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ ‘నా మార్కు కామెడీతో సాగే చిత్రమిది. ఆద్యంతం నవ్విస్తుంది’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘లాజిక్స్, యాక్షన్, సందేశం, వినోదం ఉన్న చిత్రమిది’ అన్నారు. ‘మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. ఏప్రిల్, మే నెలల్లో షూటింగ్ జరిపి జూలైలో సినిమాను విడుదలచేస్తాం’ అని నిర్మాతలు చెప్పారు.