భార్య, కూతురి గొంతు కోసిన వృద్ధుడు.. 12 గంటల పాటు శవాల మధ్యే..
ముంబై : పదవీ విరమణ పొందిన ఓ ఆర్మీ ఉద్యోగి తన భార్య, కూతురిని కత్తితో గొంతు కోసి చంపాడు. 12 గంటల పాటు శవాల మధ్యే ఉన్నాడు. అనంతరం తన పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి.. విషయాన్ని చెప్పాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరిలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
పురుషోత్తం సింగ్ గంధోక్ అనే వ్యక్తి ఆర్మీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు. తన భార్య(81), కూతురు(55)తో కలిసి ఓ అద్దె గదిలో పురుషోత్తం ఉంటున్నాడు. భార్య గత పదేండ్ల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆమె మంచానికే పరిమితమైంది. ఇక కూతురు పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా, ఆమె కూడా అంధేరిలోని నివాసముంటోంది.
అయితే భార్య, కూతురిని చూసుకోవడం కష్టంగా మారిందని, అందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు పురుషోత్తం తన పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె తండ్రి వద్దకు రాగా, ఇంటి తలుపులు తెరిచేందుకు నిరాకరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి తలుపులు పగులగొట్టి.. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తంను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తానే ఇద్దరిని చంపినట్లు పురుషోత్తం అంగీకరించాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

