బీహార్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది దుర్మరణం
పాట్నా : బీహార్‌లోని పుర్నియా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారి 57పై బోల్తా పడింది. దీంతో 8 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
బాధితులందరూ రాజస్థాన్‌కు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. సిలిగురి నుంచి జమ్మూకు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. లారీ డ్రైవర్, క్లీనర్ ప్రమాదస్థలి నుంచి తప్పించుకున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

