బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 06, 2020 , 13:41:29

ప్రియుడితో న‌గ్నంగా.. భ‌ర్త చేతిలో భార్య హ‌తం

ప్రియుడితో న‌గ్నంగా.. భ‌ర్త చేతిలో భార్య హ‌తం

ముంబై : ఓ వివాహిత త‌న ప్రియుడితో న‌గ్నంగా, స‌న్నిహితంగా ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. ఈ దృశ్యాలు వివాహిత భ‌ర్త‌కు చేర‌డంతో కోపంతో రగిలిపోయి ఆమెను క‌త్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. 

భివాండిలోని అన్సార్ న‌గ‌ర్‌కు చెందిన రఫీక్ మ‌హ్మ‌ద్ యూన‌స్‌(50)కు భార్య న‌స్రీన్‌, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా యూన‌స్ ఉపాధి కోల్పోయాడు. దీంతో త‌న భార్య‌, ముగ్గురు పిల్ల‌ల‌ను తీసుకుని నాగౌన్ ఏరియాలో ఉంటున్న త‌న సోదరి నివాసానికి మకాం మార్చాడు. 

అయితే నస్రీన్‌కు మ‌రో యువ‌కుడితో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ప్రియుడితో నస్రీన్ న‌గ్నంగా, స‌న్నిహితంగా ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. ఆ దృశ్యాలు భ‌ర్త యూన‌స్‌కు చేర‌డంతో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోన‌య్యాడు. సోద‌రి నివాసంలోనే భార్య‌ను క‌త్తితో పొడిచి చంపాడు. ఆ త‌ర్వాత శాంతిన‌గ‌ర్ పోలీసుల ఎదుట యూన‌స్ లొంగిపోయాడు. న‌స్రీన్ ప్రియుడిని స‌ద్దాంగా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo