అదృశ్యమైన ఐదుగురి మృతదేహాలు వెలికితీత

భోపాల్: నెల రోజుల కిందట అదృశ్యమైన ఐదుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దేవాస్‌కు చెందిన 45 ఏండ్ల మమత, ఆమె ఇద్దరు కుమార్తెలైన 21 ఏండ్ల రూపాలీ, 14 ఏండ్ల దివ్య, సోదర వరుసమ్యే మరో ఇద్దరు మే 13 నుంచి అదృశ్యమయ్యారు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా రూపాలీతో ఇంటి యజమాని సురేంద్ర చౌహాన్‌కు సంబంధమున్నది. అతడు మరో మహిళను పెండ్లి చేసేకునేందుకు సిద్ధం కాగా సురేంద్ర తనని పెండ్లి చేసుకోనున్నట్లు అతడితో కలిసి ఉన్న ఫొటోను రూపాలి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై ఆగ్రహం చెందిన సురేంద్ర ఆమెతోపాటు తమ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యుల అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించాడు.
ఈ ఐదుగురిని గొంతునులిమి హత్య చేసిన సురేంద్ర తన 12 మంది అనుచరుల సహాయంతో 8-10 అడుగుల లోతు గొయ్యి తీయించి వారి మృతదేహాలను పూడ్చిపెట్టించాడు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు తాను మరో వ్యక్తిని పెండ్లి చేసుకున్నానని, తన కుటుంబ సభ్యులు తనతో ఉన్నట్లు రూపాలీ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పోలీసులు దీనిపై ఆరా తీయడంతోపాటు సురేంద్ర కాల్ డేటా పరిశీలించగా అసలు గుట్టు రట్టయ్యింది. కాల్ డేటా ఆధారంగా మే 13న సురేంద్ర మాట్లాడిన అతడి ఐదుగురు అనుచరులను గుర్తించి వారిని ప్రశ్నించడంతో హత్యల విషయం బయపడింది. దీంతో గోతిని తవ్వించి అందులో పూడ్చిన శిథిలమైన ఐదుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీయించారు. సురేంద్రతోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. సహకరించిన మరి కొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

