రైల్వే ఓవర్ బ్రిడ్జి పైనుంచి పడిన బైక్… ఇద్దరు బాలురు మృతి
లక్నో: రైల్వే ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఒక బైక్ పడింది. దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు బాలురు మరణించారు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం హోలీ జరుపుకున్న ముగ్గురు బాలురు బుల్లెట్ బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పింది. గ్రేటర్ నోయిడాలోని దాద్రీ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పైనుంచి అది కిందకు పడింది. దీంతో బుల్లెట్‌పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు బాలురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, బుల్లెట్ బైక్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పైనుంచి కింద పడిన సమయంలో ఆ ముగ్గురు బాలురు మద్యంలో మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురూ నోయిడాలోని కులేసర ప్రాంతానికి చెందిన వారిని చెప్పారు. మరణించిన ఇద్దరి బాలుర మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

