ఫీజు చెల్లించలేదని కులం పేరుతో దూషణ.. అవమానంతో యువతి ఆత్మహత్య
చెన్నై : కాలేజీ ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థినిని టీచర్లు కులం పేరుతో దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు యువతి అవమానంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణంలో వెలుగు చూసింది.
ఎస్సీ కులానికి చెందిన సుభాషిణి(19) ఓ ప్రయివేటు కాలేజీలో ఫిజియోథెరపీ కోర్సును అభ్యసిస్తోంది. అయితే ఆమె కాలేజీ ఫీజు చెల్లించలేదు. దీంతో తరగతి గదిలోనే సుభాషిణిని టీచర్ కులం పేరుతో దూషించారు. అంతటితో ఆగకుండా క్లాస్ రూమ్ బయట నిల్చోవాలని సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు జరిగిన అవమానాన్ని భరించలేక సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది.
కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమైన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సుభాషిణిని దూషించిన టీచర్ను అరెస్టు చేసేంత వరకు డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించొద్దని తల్లిదండ్రులు కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బస్సును ధ్వంసం చేసిన విద్యార్థులు
సుభాషిణి ఆత్మహత్యను తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. కాలేజీ ఎదుట నిరసనకు దిగారు. క్యాంపస్ పార్కింగ్లో ఉన్న బస్సును ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కాలేజీ క్యాంపస్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

