శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 17:17:20

40 ఏండ్ల వ్యక్తితో పారిపోయిన 19 ఏండ్ల యువతి!

40 ఏండ్ల వ్యక్తితో పారిపోయిన 19 ఏండ్ల యువతి!

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ నలభై ఏండ్ల వ్యక్తి 19 ఏండ్ల పొరుగింటి యువతితో పారిపోయాడు. పటాన్ జిల్లా సిద్దపూర్ కు చెందిన షోవాంజీ ఠాకోర్ అనే వ్యక్తి యువతిని అపహరించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైకోర్టు న్యాయవాది కథనం ప్రకారం.. జూన్ 2న యువతి అదృశ్యమైనట్లు సమాచారం. కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించగా, తప్పిపోయినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో  కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

జూన్ 22 న జరిగిన విచారణ సందర్భంగా, బాలికను కోర్టుకు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అయితే 40 ఏండ్ల ఠాకూర్‌ వివాహితుడు మాత్రమే కాదు అతడి కుమార్తెకు కూడా ఇద్దరు పిల్లలున్నారని బాధితులు కోర్టు పిటిషన్‌లో తెలిపారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకొని తమ కుమార్తెను తమకు క్షేమంగా అప్పగించాలని బాధిత తల్లిదండ్రులు హైకోర్టును విన్నవించకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo