క్యాప్సికం: 3 (ఎరుపు ఆకుపచ్చ పసుపు పచ్చ రంగువి ఒక్కొక్కటి చొప్పున)
మినప్పప్పు: ఒక టేబుల్ స్పూన్
శనగపప్పు: ఒక టేబుల్ స్పూన్
ఆవాలు: టేబుల్ స్పూన్
మెంతులు: పావు టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు: ఐదారు
చింతపండు గుజ్జు: టేబుల్ స్పూన్ (లేదా)
టమాటాలు: నాలుగు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ఇంగువ: చిటికెడు
ఉప్పు: తగినంత
ముందుగా కాప్సికంను శుభ్రంగా కడిగి సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి . పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె వేసి, మినపప్పు శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులను వేసి వేయించుకోవాలి. కాస్త ఇంగువ కూడా జోడించాలి. అవి తీసి పక్కన పెట్టుకున్నాక, అదే నూనెలో ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను వేసుకొని మగ్గనివ్వాలి. అందులో పులుపు కోసం, మన ఇష్టాన్ని బట్టి చింతపండు రసం కానీ లేదా టమాటా ముక్కలను కానీ వేసుకోవాలి.
ఇప్పుడు పోపు చేసిన పప్పుల్ని మిక్సీలో పొడిలా పట్టుకోవాలి. అందులోనే మగ్గించి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను కూడా వేసి తగినంత ఉప్పు కూడా కలిపి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తీశాక సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన క్యాప్సికం పచ్చడి రెడీ!