కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్: పావు కిలో, అల్లం: ఓ ముక్క, ఉల్లిగడ్డ: ఒకటి, వెల్లుల్లి రెబ్బలు: పది, పచ్చిమిర్చి: రెండు, ధనియాలు: ఒక టీస్పూన్, జీలకర్ర: అర టీస్పూన్, నిమ్మగడ్డి: ఒక టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఎండు మిరప: పది, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన బీన్స్: పావు కప్పు, క్యాలీఫ్లవర్ ముక్కలు: అర కప్పు, వంకాయలు: నాలుగు, కొబ్బరి పాలు: ఒక కప్పు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ఎండు మిరపకాయల్ని అరగంటపాటు నీటిలో నానబెట్టాలి. మిక్సీ జార్లో అల్లం, ఉల్లిగడ్డ ముక్కలు, ఆరు వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, నిమ్మగడ్డి, కొత్తిమీర, నాన బెట్టిన ఎండు మిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వెయ్యాలి. బాగా వేగాక క్యాలీఫ్లవర్, వంకాయ ముక్కలు, బీన్స్, గ్రైండ్ చేసుకున్న కారం మిశ్రమం జోడించి నిమిషం పాటు వేయించాలి. దీంట్లో చికెన్, తగినంత ఉప్పు వేసి కొబ్బరిపాలు, ఒక కప్పు నీళ్లు పోసి సన్నని మంటపై అరగంట ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లుకుంటే థాయ్ చికెన్ కర్రీ సిద్ధం.