చిలగడ దుంపలు: మీడియం సైజువి మూడు
రొట్టెలు: నాలుగు
పచ్చిమిరపకాయలు: మూడు నాలుగు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ధనియాల పొడి: అర టీ స్పూన్
జీరాపొడి: అర టీ స్పూన్
గరం మసాలా: అర స్పూను
ఆమ్ చూర్: టీ స్పూన్
ఉప్పు: తగినంత
గోధుమపిండి : రెండు టేబుల్ స్పూన్లు
నూనె: నాలుగు టేబుల్ స్పూన్లు
చిలకడదుంపల్ని కడిగి నీళ్లు పోసి కాకుండా ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని చెక్కు తీసి మాష్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీరలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. చిలగడ దుంపల ముద్దలో గరం మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు, ధనియాల పొడి, జీరా పొడి, ఆమ్ చూర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా చేసి పెట్టుకున్న చపాతీల మీద మందపాటి పొరలాగా రాయాలి. గోధుమ పిండిని ఒక కప్పులోకి తీసుకొని జారుడుగా నీళ్లు పోసి కలుపుకోవాలి.
గుండ్రంగా చుట్టిన చపాతీలు రెండు అంచులను ఈ పిండితో మూసివేయాలి. ఇప్పుడు చపాతీ రోల్‌ను మీడియం సైజు ముక్కలుగా చాకు సాయంతో కోసుకోవాలి. ఇలా గుండ్రంగా వచ్చిన ముక్కలను ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో ముంచి తీసి, పెనం మీద వేసి, నూనె సాయంతో రెండువైపులా కాల్చుకుంటే స్వీట్ పొటాటో స్టఫ్ చేసిన పిన్ వీల్ సమోసా రెడీ అయినట్టే!