చిలగడ దుంప సగ్గుబియ్యం అప్పాలు
చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి, కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. తర్వాత చెక్కు తీసి పక్కకు పెట్టుకోవాలి. మరోపక్క సగ్గుబియ్యాన్ని నీళ్లలో ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లను ఒంపేసి, ఆ సగ్గుబియ్యంలో ఇందాక ఉడకబెట్టుకున్న చిలగడ దుంపల ముక్కలను మెత్తగా మెదిపి వేయాలి. అల్లం పచ్చిమిరపకాయలు ముద్ద చేసి పెట్టుకోవాలి. కరివేపాకును కడిగి సన్నగా తరగాలి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి.
కావల్సిన పదార్థాలు
చిలగడదుంపలు: నాలుగు
సగ్గుబియ్యం: కప్పు
అల్లం: మీడియం సైజ్ ముక్క
పచ్చిమిరపకాయలు: నాలుగు
కొత్తిమీర తరుగు: అరకప్పు
కరివేపాకు: గుప్పెడు
బియ్యప్పిండి: టేబుల్ స్పూన్
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి, కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. తర్వాత చెక్కు తీసి పక్కకు పెట్టుకోవాలి. మరోపక్క సగ్గుబియ్యాన్ని నీళ్లలో ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లను ఒంపేసి, ఆ సగ్గుబియ్యంలో ఇందాక ఉడకబెట్టుకున్న చిలగడ దుంపల ముక్కలను మెత్తగా మెదిపి వేయాలి. అల్లం పచ్చిమిరపకాయలు ముద్ద చేసి పెట్టుకోవాలి. కరివేపాకును కడిగి సన్నగా తరగాలి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం మిశ్రమంలో వీటి తరుగు, అల్లం పచ్చిమిర్చి ముద్ద, బియ్యప్పిండి, ఉప్పు వేసి గట్టిగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటే సరి. ఇప్పుడు గుంత పొంగణాలు చేసే మూకుడును తీసుకొని ఆ గుంటల్లో కొద్దిగా నూనె రాసి ఈ మిశ్రమాన్ని నింపాలి. ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకొని మళ్లీ నూనె వేసి కాల్చుకోవాలి. బంగారు వన్నెలో వేగితే రుచికి బాగుంటాయి. వీటిని కొత్తిమీర కారం, టమాట సాస్‌లతో నంజుకుని తినొచ్చు!
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

