పైనాపిల్ ముక్కలు: ఆరు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, కారం: అర టీస్పూన్, జీలకర్ర పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత.
పైనాపిల్ ముక్కలపై కారం, ఉప్పు, జీలకర్ర పొడి చల్లి రెండు వైపులా పట్టేలా బాగా కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి, నూనె వేడయ్యాక ఒక్కొక్క పైనాపిల్ ముక్కనూ పేర్చి రెండు వైపులా దోరగా కాల్చుకుంటే తియ్యగా, కారంగా నోరూరించే పైనాపిల్ ఫ్రై రెడీ.