కావాల్సిన పదార్థాలు
పుల్లటి మామిడికాయలు: 4
కారం: 150 గ్రాములు
ఆవపిండి: 50 గ్రాములు
నువ్వులు: 200 గ్రాములు
ఉప్పు: 125 గ్రాములు
నువ్వుల నూనె: పావు లీటర్
తయారు చేసే విధానం
ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి, మీడియం సైజు ముక్కలుగా కొట్టాలి. తర్వాత అందులోని జీడి, లోపలి పొరలను తీసివేసి తుడిచి కాసేపు ఆరబెట్టాలి. బాణట్లో నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఇందాక తరిగిన మామిడి ముక్కలు వేయాలి. దానిపైన కారం పోసి, కలియతిప్పుతూ ఉప్పు, ఆవపిండి, నువ్వులు కూడా వేసుకోవాలి. ముక్కలకు పొడులన్నీ సమానంగా పట్టేలా తిప్పుతూ చివర్లో నూనె పోయాలి. మళ్లీ కలియతిప్పి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. రెండు మూడు రోజుల తర్వాత జాడీ తెరచి అందులో మరో కప్పు నూనె జోడించి కలుపుకొంటే అన్నంతో తినడానికి కమ్మగా, ఎర్రగా నోరూరించే నువ్వుల ఆవకాయ సిద్ధమైపోతుంది.
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు