సిటీబ్యూరో, ఆగస్టు 18 ( నమస్తే తెలంగాణ ) : కేబీఆర్ వన్‌వేతో పలు ఆర్టీసీ బస్సుల రూట్‌ను మార్చినట్టు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్- కేబీఆర్ పార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, హెచ్సిటీ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనల దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు ఈ మారిన బస్సు రూట్లను, స్టాప్‌లను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఆర్టీసీ సూచించింది.
బస్సులు ఇలా వెళ్లాలి.. రూట్ నం. 47ఎల్
(సికింద్రాబాద్/జేబీఎస్-మణికొండ)
సికింద్రాబాద్, బేగంపేట, నాగార్జున సరిల్ ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, అపోలో ఆస్పత్రి, ఫిల్మ్ నగర్ దర్గా మీదుగా మణికొండ వెళ్తుంది.
డౌన్ జర్నీ (మణికొండ-సికింద్రాబాద్ ):
మణికొండ, పంచవటి కాలనీ, దర్గా , ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్, టీవీ9, పంజాగుట్ట పీఎస్, ఆర్.జె. కాలేజీ , పోలీస్ లైన్ ప్లాజా మీదుగా సికింద్రాబాద్ వెళ్తుంది.
రూట్ నం. 10హెచ్ (సికింద్రాబాద్-కొండాపూర్)
సికింద్రాబాద్, బేగంపేట, మైత్రివనం, యూసఫ్‌గూడ ఎక్స్ రోడ్స్, వెంకటగిరి, పెద్దమ్మ గుడి, మాదాపూర్ పోలీసు స్టేషన్ మీదుగా కొండాపూర్ వెళ్తుంది.
డౌన్ జర్నీ 10హెచ్ (కొండాపూర్-సికింద్రాబాద్)
కొండాపూర్ పెద్దమ గుడి జూబ్లీ చెక్‌పోస్ట్, వెంకటగిరి, యూసఫ్‌గూడ, మైత్రివనం, బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్తుంది.
రూట్ నం. 222ఏ (కోఠి-పటాన్చెరు)
కోఠి, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్, నాగార్జున సరిల్, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా అపోలో ఆస్పత్రి, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి మాదాపూర్ పీఎస్ మీదుగా పటాన్ చెరువు చేరుకుంటుంది.
డౌన్ జర్నీ రూట్ నం. 222ఏ (పటాన్ చెరు-కోఠి)లో భాగంగా పటాన్ చెరు మాదాపూర్ పీఎస్ పెద్దమ్మ గుడి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అన్నపూర్ణ స్టూడియో ఎల్ వీ ప్రసాద్, నాగార్జున సరిల్ మాసబ్ ట్యాంక్ లక్డికపూల్ మీదుగా కోఠి మార్గంలో నడుస్తుంది.
రూట్ నం. 127కే (కోఠి- కొండాపూర్)
కోఠి, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్, పెన్షన్ హౌస్, ఎమ్మెల్యే కాలనీ, అపోలో ఆస్పత్రి రోడ్డు నంబర్ 45 మాదాపూర్ పీఎస్ మీదుగా కొండాపూర్ చేరుకుంటుంది. డౌన్ జర్నీ రూట్ నం.127కే (కొండాపూర్-కోఠి) బస్సు కొండాపూర్ మాదాపూర్ పీఎస్, రోడ్డునంబర్ 45,జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, పెన్షన్ హౌస్ మీదుగా కోఠికి చేరుకుంటుంది.
తలలుపట్టుకున్న అధికారులు
అదే సమయంలో వాహనాల రద్దీ, ట్రాఫిక్‌జామ్‌ల విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్ రోడ్డు నంబర్ 45 జంక్షన్ వద్దకు వచ్చి టూవీలర్‌పై స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించారు. వన్‌వే అమలవుతున్న రోడ్లలో వాహనాలు బారులు తీరి ఉండడంతో ఎక్కడెక్కడ ఇబ్బందులు తలెత్తాయో స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల వాహనదారులు అసహనం వ్యక్తం చేయడాన్ని సీపీ గమనించారు. సీపీతో పాటు ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, డీసీపీ కాజల్, విజయ్‌కుమార్ తదితరులు వన్‌వే అమలవుతున్న ప్రాంతంలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి మార్పులు , చేర్పులపై చర్చించినట్లు సమాచారం.
మరోసారి ఇంకొక ప్రయోగం చేయడంతో అది కూడా విఫలమై సీపీతో సహా అధికారులంతా తలలు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్పెషల్ డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్‌ను పర్యవేక్షించామని, కొన్ని చోట్ల సైన్‌బోర్డ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ట్రాఫిక్ అడ్వైజరీని ప్రజలు పట్టించుకోవడం లేదని, వాటిని అందరూ పాటించాలని, రెండు మూడురోజుల్లో ఇబ్బందులన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. నాలుగు షిఫ్ట్‌లలో అధికారులు పనిచేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఖైరతాబాద్, జూబ్లిహిల్స్ జోన్లకు సంబంధించిన అధికారులు ఇక్కడే ఉండి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. రెండుచోట్ల కాస్త ఇబ్బంది కలుగుతున్నదని, దాన్నికూడా క్లియర్ చేస్తున్నామని సీపీ సజ్జనార్ వెల్లడించారు.