కావలసిన పదార్థాలు
పెసర మొలకలు: పెద్దకప్పు
అల్లం: చిన్న ముక్క
పచ్చిమిర్చి: నాలుగైదు
గోధుమ పిండి: ఒకటిన్నర కప్పు
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
ధనియాల పొడి: అరస్పూను
కొత్తిమీర: పెద్ద కట్ట
జీలకర్ర: అరస్పూను
నిమ్మరసం: కొద్దిగా
తయారు చేసే విధానం
ముందుగా పెసర మొలకల్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. ఇది సుమారు కప్పుడు అయితే బాగుంటుంది. ఇప్పుడు కాస్త పెద్ద గిన్నెలోకి గోధుమ పిండి, టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు, ధనియాల పొడి వేసి, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా సమంగా చల్లుకొని కాసిన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో కాస్త నిమ్మరసం కూడా జోడిస్తే పులుపు కలిసి రుచిగా ఉంటుంది. ఈ ఫ్లేవర్ నచ్చదు అనుకున్న వాళ్లు ఇది కలపకుండా ఉంటే సరి! పిండి కలపడం పూర్తయ్యాక దాన్ని ఉండలు చేసుకొని, గుండ్రంగా రొట్టెల్లా ఒత్తుకొని పొయ్యి మీద పెనం పెట్టి సన్నటి మంట మీద ఎర్రగా కాల్చుకుంటే… మృదువుగా కరకరలాడే పెసర పరాఠా సిద్ధమైపోతుంది. కొద్దిగా పెరుగుతోనో, నచ్చిన పచ్చడితోనో నంచుకు తినడమే తరువాయి!
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు