కావలసిన పదార్థాలు:
నూనె: రెండు టీ స్పూన్లు, కొత్తిమీర: రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి: రెండు రెబ్బలు, అల్లం: చిన్నముక్క, నిమ్మకాయ: ఒకటి, క్యారెట్, క్యాబేజీ తురుము: రెండు టీ స్పూన్ల చొప్పున, ఉల్లిపాయ: చిన్నది, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: అర టీ స్పూన్, కార్న్‌ఫ్లోర్: అర టీ స్పూన్
తయారీ విధానం:: పాత్రలోని నూనె వేడయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజీ, కొత్తిమీర తురుము వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత రెండు కప్పుల నీళ్ళు పోసి పది నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళలో కార్న్‌ఫ్లోర్ బాగా కలిపి, మరుగుతున్న మిశ్రమంలో పోసి మళ్లీ కలపాలి. చివరగా ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం వేసి దింపేయాలి.