పాలు: అరలీటరు
సేమ్యా: ఒక కప్పు
పాల పొడి లేదా మిల్క్ మెయిడ్: రెండు టేబుల్ స్పూన్లు
చక్కెర : రెండున్నర టేబుల్ స్పూన్లు
కస్టర్డ్ పౌడర్: రెండు టేబుల్ స్పూన్లు
అరటి, ఆపిల్, కిస్మిస్ పండ్ల ముక్కలు: రెండు కప్పులు
ఆప్రికాట్లు: నాలుగు
బాదం, జీడిపప్పు, పిస్తా: రెండు మూడు
స్పూన్లు (ముక్కలు)
సేమ్యా వేయించి పక్కకు పెట్టుకోవాలి. పాలు కాచి అందులో మిల్క్ మెయిడ్ లేదా పాల పొడి వేయాలి. తర్వాత సేమ్యా వేసి ఉడికాక, పంచదార కూడా వేసుకోవాలి. పాయసం కాస్త దగ్గరకు వచ్చాక చల్లటి నీళ్లలో కస్టర్డ్ పొడి వేసి కలిపి పోయాలి. తర్వాత పాయసాన్ని చల్లారబెట్టాలి. ఆపిల్, అరటి పండ్లతో పాటు ఆప్రికాట్ ముక్కలను ఇందులో వేయాలి.
ఆప్రికాట్లు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఉడికించి ముక్కలు చేయాలి. బాదం, జీడిపప్పు, పిస్తా… ఇలా నచ్చిన వాటిని చిన్న ముక్కలుగా తరిగి సేమ్యా మిశ్రమానికి జోడిస్తే కస్టర్డ్ రెడీ. దీన్ని చల్లగా తినాలనిపిస్తే కాసేపు ఫ్రిజ్లో పెట్టుకుంటే సరి!
– ఎం.బాలరాయుడు,
పాకశాస్త్ర నిపుణురాలు