ఓట్స్ సేమ్యా ఉప్మా

కావలసిన పదార్థాలు: సేమ్యా: ఒక కప్పు, ఓట్స్: అర కప్పు, క్యారెట్, కాప్సికం, పచ్చి బఠానీలు: పావు కప్పు, ఉల్లిపాయ: ఒకటి చిన్నది, పచ్చిమిర్చి: మూడు, కరివేపాకు: ఒక రెమ్మ, కొత్తిమీర: కొద్దిగా, ఆవాలు, జీలకర్ర: పావు టీ స్పూన్ చొప్పున, శనగపప్పు: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, నెయ్యి: రెండు టీ స్పూన్లు.
తయారీ విధానం: కడాయిలో చెంచానిండా నెయ్యి వేసి వేడయ్యాక సేమ్యాను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరో చెంచా నెయ్యి వేడి చేసి ఓట్స్‌ను దోరగా వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కాప్సికం చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు మరిగించి, వేయించిన సేమ్యా వేయాలి. సేమ్యా ముప్పావు ఉడికిన తర్వాత దింపి జల్లెడ లేదా చిల్లుల పళ్లెంలో వేసి వెంటనే చల్లటి నీళ్లు పోయాలి. దీనివల్ల సేమ్యా ముద్దగా కాకుండా పొడిపొడిగా అంటుకోకుండా ఉంటుంది. మరో గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక శనగపప్పు, కరివేపాకు వేయాలి. అది కొద్దిగా వేగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కాస్త మెత్తబడే వరకు వేపాలి. తర్వాత ఇందులో క్యారెట్, కాప్సికం ముక్కలు, పచ్చి బఠానీలు వేసి నిదానంగా వేయించాలి. ఇప్పుడు వేయించిన ఓట్స్ వేసి కలిపి కొద్దిగా వేపి సేమ్యా వేసి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి మూతపెట్టి, రెండు నిమిషాలు మగ్గనిస్తే చాలు. వేడివేడి ఓట్స్ సేమ్యా ఉప్మా రెడీ.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

