చికెన్ కీమా: ఒక కప్పు, బ్రెడ్ ముక్కలు: ఆరు, నూనె: ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, గరం మసాలా: ఒక టీస్పూన్,
ఉల్లిగడ్డ తరుగు: ఒక కప్పు, చీజ్ ైస్లెస్లు: మూడు, చిల్లీ సాస్: ఒక టీస్పూన్.
ముందుగా ఒక గిన్నెలో నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు వేయించాక, చికెన్ కీమా వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు కలపాలి. రెండు నిమిషాల తర్వాత చిల్లీ సాస్తోపాటు కొన్ని నీళ్లు పోసి మంట ఎక్కువ చేయాలి. మిశ్రమంలో నీరంతా ఆవిరయ్యాక దింపేయాలి. ఆపైన టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కపై చీజ్ ైస్లెస్ పెట్టాలి, దానిపై చికెన్ కీమా వేయాలి. మరో బ్రెడ్ ముక్కను కప్పి పెట్టి సర్వ్ చేసుకోవాలి.