సేమియా: ఒక కప్పు, గోరువెచ్చని పాలు: రెండున్నర కప్పులు, తాజా పెరుగు: ముప్పావు కప్పు, పుల్లటి పెరుగు: ఒక కప్పు, ఆవాలు: అర టీ స్పూన్, కరివేపాకు: ఒక రెమ్మ, పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్, నీళ్లు: ఒకటిన్నర కప్పు, ఉప్పు: తగినంత, నెయ్యి: సరిపడా, డ్రై ఫ్రూట్స్: పావు కప్పు.
గిన్నెలో నెయ్యిపోసి వేడి చేయాలి. అందులో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనబెట్టాలి. తర్వాత అందులోనే ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేయించాలి. తర్వాత నీళ్లు పోసి మరిగించాలి. దాంట్లో ఉప్పు, సేమియా వేసి మూతపెట్టాలి. రెండు నిమిషాల తర్వాత పాలు కలపాలి. మిశ్రమం దగ్గరికి అయ్యాక దింపేసి చల్లారబెట్టాలి. ఆపైన అందులో తాజా పెరుగు, పుల్లటి పెరుగు కలపాలి. చివరలో డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజల్లాంటివి వేసి సర్వ్ చేసుకోవాలి.
Air Fried Coconut Shrimp Recipe | ఎయిర్ ఫ్రైడ్ కోకోనట్ ష్రింప్”
Meal Maker Vada Recipe | మీల్మేకర్ వడ తయారీ విధానం”
Broccoli Cheese Sticks Recipe | బ్రొకోలి చీజ్ స్టిక్స్ తయారీ విధానం”
“Shabnam Curry Recipe | షబ్నమ్ కర్రీ తయారీ విధానం”