గోధుమపిండి: ఒక కప్పు, ఆలుగడ్డ: ఒకటి (పెద్దది), కారం: ఒక టీస్పూన్, వాము: పావు టీస్పూన్, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, జీలకర్ర పొడి: పావు టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
ఆలుగడ్డను ఉడికించి మెత్తగా మెదుపుకోవాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, ఆలూ ముద్ద, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు, కొత్తిమీర తరుగు, ఒక టీస్పూన్ నూనె, వాము వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లుపోసి చపాతీ పిండిలా కలుపుకొని పావు గంటపాటు పక్కనపెట్టాలి. స్టవ్‌మీద కడాయి ఉంచి, వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీలు ఒత్తుకుని కాల్చుకుంటే ఆలూ పూరీ సిద్ధం.