శనగలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: అర టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, పచ్చిమిర్చి: నాలుగు, చాట్ మసాలా: పావు టీస్పూన్, కరివేపాకు: ఒక రెబ్బ, కొత్తిమీర తురుము: కొద్దిగా, నిమ్మరసం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత.
శనగల్ని నాలుగు గంటలపాటు నానబెట్టి కుక్కర్లో వేసి, మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి నీళ్లు వడకట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక ఉడికిన శనగలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. జీలకర్ర, తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా జోడించి.. సన్నని మంటపై ఐదు నిమిషాలు వేయించాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేగాక కారం, పసుపు, ఉప్పు, చాట్ మసాలా వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి, నిమ్మరసం చల్లితే నోరూరించే చోలే చాట్ సిద్ధం.
“Coconut Milk Chicken Recipe | కొబ్బరిపాల చికెన్ తయారీ విధానం”
“Panner Kheer Recipe | పనీర్ ఖీర్ తయారీ విధానం”
Aloo Mirchi Bajji Recipe | ఆలూ మిర్చి బజ్జి తయారీ విధానం”