పల్లీలు: ఒక కప్పు, బియ్యపు పిండి: పావు కప్పు, శనగపిండి: పావుకప్పు, కారం: ఒక టీస్పూన్, చాట్ మసాలా: అర టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నిమ్మరసం: ఒక టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
ఒక గిన్నెలో పల్లీలు, బియ్యపు పిండి, శనగ పిండి, కారం, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుని పల్లీలకు పిండి బాగా పట్టేలా గట్టిగానే కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక పిండితో ఉన్న పల్లీలను విడివిడిగా వేస్తూ దోరగా కాల్చుకుంటే కరకరలాడే పల్లీల పకోడి సిద్ధం.
Maramarala Bonda Recipe | మరమరాల బోండా తయారీ విధానం
Fried Idli Recipe | ఫ్రైడ్ ఇడ్లీ తయారీ విధానం