బ్రెడ్: నాలుగు
బటర్: ఒక ముక్క
మొజారెల్లా చీజ్: 100 గ్రా.
అమూల్ చీజ్: 100 గ్రా.
టమాటా కెచప్: నాలుగు స్పూన్లు
క్యాప్సికం: ఒకటి
ఉల్లిగడ్డ: ఒకటి
తొలుత ఉల్లిగడ్డ, క్యాప్సికంలను సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా బటర్ వేసి కాగాక బ్రెడ్ముక్కను ఒకవైపు కాల్చుకోవాలి. తర్వాత తీసి కాల్చిన వైపు టమాటా కెచప్ రాయాలి. మొజారెల్లా చీజ్, అమూల్ చీజ్లను తీసుకొని తురిమి, కెచప్ రాసిన బ్రెడ్ మీద వేయాలి. క్యాప్సికం, ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా జోడించాలి. ఇప్పుడు మళ్లీ పెనం మీద కొద్దిగా బటర్ రాసి ఈ బ్రెడ్ ముక్కను పెట్టాలి.
సన్నని సెగ మీద కాసేపు ఉంచితే బ్రెడ్ రెండో వైపు కూడ వేగడమే కాకుండా పైన వేసిన చీజ్ కరిగి, ముక్కలు కాస్త ఉడికి తినడానికి రుచిగా, చూసేందుకు ఆకర్షణీయంగా తయారవుతుంది. ఇక, వెరైటీ పిజ్జాను రుచి చూసేయడమే!