కావలసిన పదార్థాలు
అరటిపండు: ఒకటి, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు: పావు కప్పు, మైదా: ఒక కప్పు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర: పావు టీస్పూన్, బేకింగ్ సోడా: పావు టీస్పూన్, ఉప్పు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో తొక్కతీసిన అరటిపండు, చక్కెర వేసి మెత్తగా మెదపాలి. పెరుగు, నెయ్యి, ఉప్పు, బేకింగ్ సోడా జోడించాలి. మైదాపిండి, జీలకర్ర కూడా వేసి నీళ్లు పోయకుండా ముద్దలా చేసి నాలుగు గంటలపాటు మూతపెట్టి పక్కన పెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చెయ్యాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని కాస్త మందంగా చిన్నచిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకుంటే బనానా బన్లు సిద్ధం. కారంకారంగా చట్నీతో, తీయతీయగా తేనెతో తినవచ్చు.