కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్: అర కిలో, మైదా: పావు కప్పు, కార్న్‌ఫ్లోర్: పావు కప్పు, గుడ్డు: ఒకటి, పెరుగు: అర కప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీస్పూన్ చొప్పున, పసుపు: అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: రెండు రెబ్బలు, ఉల్లిగడ్డ: ఒకటి, రెడ్ చిల్లీ సాస్: ఒక టీస్పూన్, అజినమోటో: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు టీస్పూన్లు.
తయారీ విధానం
చికెన్‌ను సన్నని పొడవాటి ముక్కల్లా కోసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గుడ్డు, ఉప్పు, మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. కడాయిలో నూనెపోసి చికెన్ ముక్కల్ని విడివిడిగా వేయించాలి. ఆ తర్వాత పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి.. వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయించాలి. అన్నీ బాగా వేగాక రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అజినమోటో, పసుపు, చిలికిన పెరుగు వేసి బాగా కలిపి ఒక నిమిషంపాటు మూతపెట్టి సన్నని మంటపై మగ్గనివ్వాలి. ఆ మిశ్రమంలో వేయించిన చికెన్ జోడించి.. బాగా కలిపి పైనుంచి నిమ్మరసం వేసుకుంటే నోరూరించే అపోలో చికెన్ సిద్ధం.