UPSC | యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల.. త్వరలోనే ఇంటర్వ్యూ తేదీల ప్రకటన
ఇంటర్వ్యూకు ఎంపికైనవాళ్లకు ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో నిర్వహిస్తారు
UPSC : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవాళ్లకు ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ త్వరలోనే వెల్లడించనుంది. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైనవాళ్లకు ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో నిర్వహిస్తారు. సెప్టెంబర్ 16 నుంచి 25వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2 నింపి, యూపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మెయిన్స్ రాసిన అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in.లోకి వెళ్లి తమ రిజల్ట్ చెక్ చేసుకోవాలి. యూపీఎస్సీ హోమ్ పేజీలో మెయిన్స్-2022 ఫలితాల లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ వస్తుంది. పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రతిభ, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కులను బట్టి ఆలిండియా సర్వీసులకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ ముందుగా 861 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత పోస్టుల సంఖ్యను 1011కు పెంచింది. దాదాపు 13 వేల మంది మెయిన్స్ ఎగ్జామ్ రాశారు.
Read Today's Latest Comparative-exams News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

