ముంబై: బాలీవుడ్ ప్రేక్షకులకు జీనత్ అమన్(Zeenat Aman) అందరికీ తెలిసిందే. ఆ బ్యూటీ క్వీన్ తన కెరీర్ ఆరంభంలో ఓ మోడల్. ఆ నాటి మేటి కంపెనీలకు ఆమె ఎన్నో వాణిజ్య ప్రకటనలు చేశారు. అయితే ఇటీవలే ఆమె కొత్తగా ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ ఓపెన్ చేశారు. దాంట్లో జీనత్ అమన్ పెట్టిన పోస్టు ఇప్పుడు అందరీ ఆకట్టుకుంటోంది. 16 ఏళ్ల వయసులో.. తాజ్‌మహల్ వద్ద జీనత్ ఫోటో షూట్లో పాల్గొన్నది. బ్రూక్‌బాండ్ తాజ్‌మహల్(Tajmahal) కోసం ఆ రోజుల్లో జీనత్ షూట్ చేసింది. ఆ టీ బ్రాండ్ ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేసిన జీనత్ .. అప్పుడు ధరించిన చెవి రింగులు ఇంకా తన వద్దే ఉన్నట్లు కూడా ఆ పోస్టులో చెప్పింది. ప్రస్తుతం జీనత్ అమన్ వయసు 71 ఏళ్లు. స్కూల్‌కు వెళ్లే రోజుల్లో మోడల్‌ను అని, టీ యాడ్‌లో ధరించిన చెవి రింగులు ఇంకా తన వద్దే ఉన్నాయని ఆమె పేర్కొన్నది.