బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఈద్‌కు అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. కానీ ఈ మూవీ దారుణంగా నిరాశపరిచింది. ఓ రేంజ్లో నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. రివ్యూలన్నీ కూడా నెగటివ్‌గానే వచ్చాయి. ముఖ్యంగా ప్రపంచంలో తనను తాను నంబర్ వన్ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) అయితే ఈ మూవీ గురించే కాదు సల్మాన్‌పై వ్యక్తిగత దాడికి కూడా దిగాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సల్మాన్.. అతనిపై పరువు నష్టం దావా కూడా వేయగా.. ఇద్దరి మధ్య న్యాయ పోరాటం నడుస్తోంది.
అయితే తాజాగా ఈ మూవీ వల్ల జీ స్టూడియో ఏకంగా రూ.95 కోట్లు నష్టపోయిందన్న వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని చెబుతూ.. తాజాగా కేఆర్కే మరో ట్వీట్ చేశాడు. మీడియా రిపోర్టుల ప్రకారం ఈ మధ్య రిలీజైన పెద్ద సినిమా వల్ల జీ రూ.95 కోట్లు నష్టపోయిందని తెలిసింది. ఈ క్రెడిట్ అంతా వరల్డ్ నంబర్ వన్ క్రిటిక్కే దక్కుతుంది అని ట్వీట్ చేశాడు.
పే పర్ వ్యూ ప్రకారం జీప్లెక్స్ ఈ రాధే మూవీ రైట్స్ తీసుకుంది. అయితే ముందుగానే నెగటివ్ టాక్ రావడంతో జీ ఆశించిన స్థాయి స్పందన అభిమానుల నుంచి రాలేదు. రూ.230 కోట్లు పెట్టి ఈ మూవీ రైట్స్ తీసుకుంది జీప్లెక్స్. కానీ ఆశించిన మేర పే పర్ వ్యూలు రాలేదు. అయితే శాటిలైట్ టెలివిజన్ ప్రిమియర్ కూడా ఉండటంతో యాడ్స్ ద్వారా రూ.50, 60 కోట్లు వస్తుందని జీ అంచనా వేస్తోంది. అయినా కూడా జీకి రూ.70 నుంచి రూ.80 కోట్ల నష్టం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.
According to media reports #Zee is having loss of ₹95Cr for last big released film. All credit goes to The No.1 critic in the world. Love you people!
— KRK (@kamaalrkhan) June 16, 2021