ఓటమి అనేది లేకుండా వరుస సినిమాలు చేస్తున్న రాజమౌళి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో గోండు బెబ్బులి కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడు. పీరియాడికల్ మూవీగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
పలు వాయిదాలు పడ్డ ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. 45 సెకన్ల గ్లింప్స్‌తో జక్కన్న మరోసారి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌కి గురి చేశారు. అందులోని సన్నివేశాలు అందరి మనసులని దోచాయి. చూస్తుంటే చిన్నపాటి హాలీవుడ్ చిత్రంలా ఉంటుందని అభిమానులు ఆలోచనలు చేస్తున్నారు.
అయితేత ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం డిజిటల్ రైట్స్ జీ5 సొంతం చేసుకుంది జీ5 సంస్థ. నాలుగు భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ స్ట్రీమింగ్ అయితే సౌత్ నుండి తమకు మంచి పాపులారిటీ వస్తుందనే ఆశతో ఉంది జీ5. ఇప్పటికే ఈ సంస్థకి ఉత్తరాన మంచి డిమాండ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమితో సౌత్‌లోను పాగా వేయాలని భావిస్తుంది. 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.