Zebra Movie | ‘జీబ్రా’(Zebra) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి యువ నటుడు సత్యదేవ్ చాలా రోజులకు ఒక మంచి హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ (Eswar Karthik) దర్శకత్వం వహించగా.. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ చిత్రం నవంబర్ 22న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
అయితే థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆహా నిర్వహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
Will luck favor the brave? 🤔
Watch #Zebra streaming now on aha! https://t.co/Q1I1uJBy3x@ActorSatyaDev @Dhananjayaka #EashvarKarthic @SNReddy09 @amrutha_iyengar @padmajafilms2 @priya_Bshankar @JeniPiccinato @BalaSundaram_OT @OldTownPictures #ahaGold pic.twitter.com/yqBGh3R3ie
— ahavideoin (@ahavideoIN) December 20, 2024