‘బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ తిరిగే కథ ఇది. బ్లాక్ అండ్ వైట్కి సింబాలిక్‌గా ఉంటుందనే డైరెక్టర్ ఈ సినిమాకు ‘జీబ్రా’ అనే టైటిల్ పెట్టారు. ఎవరు మంచి, ఎవరు చెడు అనేది ఇందులో చివరిదాకా తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే వుంటుంది.’ అని సత్యదేవ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘జీబ్రా’. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లు.
ఈశ్వర్ కార్తిక్ దర్శకుడు. ఎస్‌ఎన్‌రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుతం బ్యాంక్ సిస్టమంతా డిజిటల్ అయ్యింది. క్రైమ్ చేయడం ఈజీ కాదు. అందులో పనిచేసేవాళ్లకు తప్ప, సామాన్యులకు అక్కడ జరిగే మిస్టేక్స్ తెలీదు.
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ గతంలో బ్యాంక్ ఉద్యోగి. ఆయన చూసిన రియల్ ఇన్సిడెంట్స్‌కి మరికొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌ని యాడ్ చూసి ఈ కథ రాశారు. ఏటీఎంలో మనం డబ్బులు తీస్తున్నప్పుడు ఓ సౌండ్‌తో డబ్బులు బయటికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగుతుంది? అనేదే ఈ సినిమా’ అని సత్యదేవ్ తెలిపారు. డాలీ ధనంజయ్, సత్యరాజ్, సత్య, ప్రియా భవానీశంకర్ ఇలా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని, టెక్నికల్‌గా ఉన్నతంగా ఈ సినిమా ఉంటుందని, తన కెరీర్‌కి మేలి మలుపుగా ఈ సినిమా నిలుస్తుందని సత్యదేవ్ నమ్మకం వ్యక్తం చేశారు.