Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Zayn Marie | ముంబైలో రాజకీయ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ నటులు జైన్ మేరీ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమిర్ ఖాన్ మేనకోడలైన జైన్ మేరీ.. పోలీసుల చర్యల కారణంగా తనకు గాయాలయ్యాయని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోను పంచుకున్నారు.
Zayn Marie | ముంబైలో రాజకీయ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ నటులు జైన్ మేరీ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమిర్ ఖాన్ మేనకోడలైన జైన్ మేరీ.. పోలీసుల చర్యల కారణంగా తనకు గాయాలయ్యాయని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోను పంచుకున్నారు. ఈ ఘటనపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్‌లో శనివారం జరిగిన నిరసన కార్యక్రమంలో జైన్ మేరీ ఖాన్, నటుడు ఇమ్రాన్ ఖాన్, నటి లేఖా వాషింగ్టన్ పాల్గొన్నారు. ఈ ఆందోళన సందర్భంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు. అనంతరం విడుదల చేశారు.
ఆదివారం జైన్ మేరీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పంచుకున్నారు. అందులో తన చేతులు, వేళ్లు, కాళ్లపై కనిపిస్తున్న గాయాల గుర్తులను చూపించారు. నిరసన సమయంలో పోలీసులు బలప్రయోగం చేయడం వల్లే తనకు గాయాలయ్యాయని ఆమె ఆరోపించారు. మమ్మల్ని ఎంతగా భయపెట్టాలని చూస్తున్నారంటే.. అసలు భయం అనేదే లేకుండా పోయేంతగా! అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది.
పోలీసులు తమను వ్యాన్‌లో తీసుకెళ్తున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్, జైన్ మేరీ మధ్య జరిగిన సరదా సంభాషణ కూడా బయటకు వచ్చింది. ఇమ్రాన్ నటించిన తొలి చిత్రం ‘జానే తూ.. యా జానే నా’లోని జై రాథోడ్ పాత్రను ప్రస్తావిస్తూ జైన్ మేరీ ఆయనను ప్రశ్నించారు. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ చేయడం, జైలుకు వెళ్లడం, ఒకరిని కొట్టడం వంటి పనులు చేయాల్సి వస్తుందని గుర్తుచేశారు. దీనికి ఇమ్రాన్ స్పందిస్తూ.. తాను గుర్రపు స్వారీ చేశానని, అయితే ఎవరినీ కొట్టలేదని సరదాగా చెప్పారు. ఇప్పుడు జైలుకు వెళ్లడం కూడా జరగొచ్చేమోనని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ సంభాషణకు సంబంధించిన దృశ్యాలను జైన్ మేరీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. మరోవైపు, “నేను డ్రైవ్‌కు వెళ్తున్నాను” అనే కామెంట్‌తో ఇమ్రాన్ వ్యాన్ నుంచి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aamir Khan
- CJP Protest
- Mumbai
- Niece
RELATED ARTICLES
తాజా వార్తలు
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

