Actress Zareen Khan | బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. ఫ్రాడ్ కేసులో జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను కోర్టు కోల్‌కతా మేజిస్ట్రేట్ వారెంట్‌ను రద్దు చేశారు. కోల్‌కతాలోని సీల్దా కోర్టు నటిపై వారెంట్‌ను జారీ చేసింది. నటిపై 2018లో కోసు నమోదైంది. దర్యాప్తు అధికారి కోల్‌కతాలోని సీల్దా కోర్టులో నటిపై చార్ట్షీట్ సమర్పించారు. అయితే, జరీన్ ఖాన్ బెయిల్ కోసం అప్పీల్ చేయకపోగా, కోర్టుకు సైతం హాజరు కాలేదు. పదేపదే గైర్హాజరు కావడంతో కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. 2018లో కోల్‌కతాలో జరిగిన దుర్గామాత పూజ కార్యక్రమంలో బాలీవుడ్ నటి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
అయితే, ఆమె ముందుగా ఒప్పందం చేసుకున్న విధంగా ప్రదర్శనకు రాలేదు. దీంతో నిర్వాహకుల్లో ఒకరు జరీన్‌తో పాటు ఆమె మేనేజర్ మోసం చేసినట్లు పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణకు పిలువగా.. గైర్హాజరయ్యారు. విచారణ అనంతరం జరీన్‌పై ఆమె మేనేజర్‌పై చార్జిషీట్ దాఖలు చేసి.. మేనేజర్ కోర్టు ఎదుట హాజరై బెయిల్ కోరారు. జరీన్ మాత్రం కోర్టుకు హాజరు కాకపోవడంతో పాటు బెయిల్ కోసం ప్రయత్నించలేదు. దీంతో కోర్టు వారెంట్‌ను జారీ చేసింది. దీనిపై కోల్‌కతా కోర్టులో సవాల్ చేయగా.. నటికి అనుకూలంగా తీర్పును వెలువరించింది.