సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జమాన’. భాస్కర్ జక్కుల దర్శకుడు. తేజస్వి అడప నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. యువహీరో ఆకాష్ పూరి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
డిఫరెంట్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించామని, ఊహించని మలుపులతో ఆద్యంతం వినోదభరితంగా సినిమా సాగుతుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో భాగం కావడం పట్ల చిత్రయూనిట్ మొత్తం ఆనందం వెలిబుచ్చారు. స్వాతి కశ్యప్, జారా తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: జగన్ .ఏ, సంగీతం: కేశవ కిరణ్.