ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ చింటు, శాంతి దేవగుడి, రామ్‌జగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భళా చోర భళా’. ప్రదీప్ దర్శకుడు. యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఏ.జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. సినిమా ట్రైలర్ విడుదలైంది.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. మిస్టరీ అంశాల కూడా ఉంటాయి. అతి తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. మా నాన్న ఏవీఎస్గారిపై ఉన్న అభిమానంతో ఆర్టిస్టులు, టెక్నీషియన్లందరూ చక్కటి సహకారం అందించారు’ అని అన్నారు. చిత్రం శ్రీను, వెంకటేష్, రవికిరణ్, రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్, సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.ప్రదీప్.