భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్సింగ్ది ఆదర్శవంతమైన అధ్యాయం. కష్టాల్లో ఉన్న టీమ్‌ను ఆపర్భాంధవుడిగా ఆయన ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన చరిత్ర యువరాజ్ సింగ్‌ది. క్యాన్సర్‌తో పోరాడి గెలిచి, ఎంతోమందిలో మనోధైర్యాన్ని నింపారు యువరాజ్. ఆయన జీవితం ఓ పోరాటం. అందుకే త్వరలో ఆ జీవితం వెండితెరపైకి రానుంది. యువరాజ్‌సింగ్ బయోపిక్‌ని నిర్మించనున్నట్టు నిర్మాతలు భూషణ్‌కుమార్, రవిభాగ్ చందక్ ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని వారు చెప్పారు. ఈ ప్రకటన రాగానే.. ఇందులో యువరాజ్‌గా ఎవరు నటిస్తారు? అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. కొన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే.. కొందరు హీరోల పేర్లు మెన్షన్ చేస్తూ, ఆడియన్ పోల్స్‌ని నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆ ఛాన్స్ దక్కించుకునే హీరో ఎవరో మరి.