Yuvan Shankar Raaja | తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడిగా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే యువన్ రీసెంట్గా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి నెట్టింట్లో ట్రెండ్ కూడా నడుస్తుంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం గోట్. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ విజిల్ పోడు ఇటీవల విడుదలై మంచి రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సాంగ్ కంపోజ్ మంచిగా లేదని.. మ్యూజిక్ కూడా అంతగా నచ్చట్లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అందువల్లనే యువన్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై యువన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.