యువహీరో నాగశౌర్య తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఎస్.ఎస్. అరుణాచలం దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతాన్నందించనున్నారు. ‘త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.
ప్రముఖ నటీనటులతో పాటు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగమవుతారు. నాగశౌర్య పాత్ర కూడా కొత్త పంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిసామి, సంగీతం: హారిస్ జయరాజ్, నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్‌కుమార్, అశోక్‌కుమార్, రచన-దర్శకత్వం: ఎస్.ఎస్.అరుణాచలం.