జీఎస్ఎన్ నాయుడు హీరోగా నటిస్తున్న సినిమా ‘యుగల్’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీగణ సుబ్రహ్మణ్యస్వామి ప్రొడక్షన్స్‌లో ఆర్ బాలాజీ నిర్మిస్తున్నారు. ప్రమోద్ కుమార్ దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో జీఎస్ నాయుడు మాట్లాడుతూ…‘యాక్షన్ నేపథ్యంగా సాగే చిత్రమిది. పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. రెండు భాగాలుగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాం. హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది’ అన్నారు.