Youtuber Akash Sagar | ఈ మధ్య సోషల్ మీడియాలో పలు యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూస్, లైక్స్ కోసం ప్రతి చెత్త కంటెంట్‌ను అప్లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక వ్యక్తి డబ్బుల కట్టలను పడేసి.. నేను డబ్బులు చెట్ల పోదల్లో పడేశాను. దొరికితే తీసుకొండి అంటూ వీడియో చేయగా.. ఈ వీడియో ఫుల్ వైరల్‌గా మారడంతో పాటు అతడి చేసిన పనికి పోలీసులు తనపై కేసు నమోదు చేశారు. ఇవే కాకుండా రోజు ఇలాంటి వీడియోలే మనం తరచూ చూస్తూ ఉంటాం.
ఇదిలావుంటే ఆకాశ్ సాగర్ అనే యూట్యూబర్ చేసిన చెత్త పని ప్రస్తుతం క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా చేసింది. ఆకాశ్ సాగర్ అనే హిందీ యూట్యూబర్‌కి అటు యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడు చేసేది. అడల్ట్ కంటెంట్ అయిన ఫాలోవర్లను బాగానే పెంచుకున్నాడు ఆకాశ్. అయితే అతడు రీసెంట్గా మేఘలయాకు ట్రిప్‌కి వెళ్లగా.. అక్కడ చేసిన ఒక చెత్త పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
మేఘలయా ట్రిప్‌కి వెళ్లిన ఆకాష్ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉన్న మావ్లిన్నాంగ్లోని ఎపిఫనీ చర్చ్‌లోకి వెళ్లి అందరిముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌లోని జై సియా రామ్ అనే పాట పాడడంతో పాటు.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశాడు. ఇదంత ఒక వీడియోగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ ఘటన డిసెంబర్ 20న జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో మేఘలయ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. చర్చిలోకి ప్రవేశించి బలవంతంగా జై శ్రీరామ్ అనడంతో పాటు భక్తులు మనోభావాలను దెబ్బతీసినందుకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ కావాలని ముందే ప్లాన్ చేసి.. ఉద్దేశపూర్వకంగా చేశాడని ఇటువంటి చర్యలు మతపరమైన గొడవలను సృష్టించడంతో పాటు క్రైస్తవుల విశ్వాసాన్ని అవమానిస్తుందని షిల్లాంగ్‌కు చెందిన సామజిక కార్యకర్త పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై మేఘాలయ సిఎం కాన్రాడ్ కె సంగ్మా ఖండించడంతో పాటు.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు.