YouTube | ప్రముఖ ఓటీటీ వేదిక.. కంటెంట్ క్రియేట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (Youtube) తన ఖాతాదారులందరికి కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఇకపై కంటెంట్‌కి వ్యతిరేకంగా తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్ పెడితే ఖాతాలను తొలగించనున్నట్లు ప్రకటించింది.
గతకొంత కాలంగా పలు యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో యూజర్లను పక్కదారి పట్టిస్తున్న విషయం తెలిసిందే. కేవలం వ్యూస్ పొందడం కోసమే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్, టైటిల్స్ పెడుతుంటాయి. అయితే ఇందులో ఏదైనా ఉంది అని యూజర్లు వీడియో ఓపెన్ చేసి చూస్తే.. అందులో వేరే సమాచారం ఉంటుంది. ముఖ్యంగా సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలపై ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.
అయితే ఈ విషయంలో యూట్యూబ్ కఠిన చర్యలు అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఇకపై తప్పుదోవ పట్టించే క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్‌తో పాటు టైటిల్ ద్వారా యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్ అకౌంట్లపై చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. వీటిని అనుసరించేందుకు యూట్యూబ్ ఛానెళ్లకు తగిన సమయం ఇస్తామని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ ఛానల్ హద్దుమీరి.. నిబంధనలు పాటించకపోతే టర్మినేట్ చేయనున్నట్లు తెలిపింది.