యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. జెన్నీ హీరోయిన్గా నటిస్తోంది. కమర్షియల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గురు పవన్ తెరకెకిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో..అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘దోస్త్ అంటే నువ్వేరా..ఫ్రెండ్ అంటే నువ్వేరా..’అనే లిరికల్ సాంగ్‌ను హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు విడుదల చేశారు. పాట బాగుందన్న వారు చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో తెలుగు చిత్ర పరిశ్రమలోని మిత్రులను చూపించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.