Hero Nagashaurya | యువ హీరో నాగశౌర్య కొత్త చిత్రాన్ని ప్రకటించారు. రామ్ దేశిన దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మిస్తున్నారు. శనివారం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగశౌర్య పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తామని మేకర్స్ తెలిపారు. సముద్రఖని, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జైరాజ్, రచన-దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్).