కౌషిక్ బాబు, శాన్వి మేఘన జంటగా నటిస్తున్న సినిమా ‘నేనే సరోజ’. సుమన్, ఆనంద్, ఆర్ఎస్ నంద ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్3 క్రియేషన్స్ పతాకంపై సదానంద్ శారద నిర్మిస్తున్నారు. శ్రీమాన్ గువ్వడవెల్లి దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.
ఈ సందర్భంగా నిర్మాత సదానంద్ శారద మాట్లాడుతూ…‘సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లల పట్ల వివక్ష ఉంది. అలాంటి వివక్షను ఎదిరిస్తూ ఎదిగిన ఓ యువతి కథ ఇది. తెలంగాణ గ్రామీణ జీవనానికి అద్దం పట్టేలా వరంగల్ కోట, సమీప ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, సదానంద్ పాటలు రాయగా..రమేష్ ముక్కెర సంగీతాన్ని అందిస్తున్నారు.